హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన పేరుతో వచ్చిన వాట్సాప్ సందేశంపై స్పందించారు. కొందరు సైబర్ నేరగాళ్లు నకిలీ నంబర్లు, డీపీలతో ప్రజలను మోసగిస్తున్నారని పేర్కొన్నారు. నేరగాళ్లు డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఎవరైనా తన పేరుతో వచ్చే వాట్సాప్ సందేశాలకు సమాధానం ఇవ్వవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. 9353849489 నంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వవద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ నంబర్‌కు డబ్బు పంపకూడదు. సైబర్ నేరగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
873408