హైదరాబాద్: ఎమ్మెల్యేను కొనుగోలు చేసిన కేసులో రామచంద్రభారతి, నందకుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో కేసును విచారించిన నాంపల్లి కోర్టు నందకుమార్‌ను 14 రోజుల రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.
జ్యుడీషియల్ రిమాండ్ అనంతరం నందకుమార్‌ను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు బంజారాహిల్స్ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 10,000 చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
