
యూపీలోని మధురలో వీడియో గేమ్ ఆడుతూ 13 ఏళ్ల బాలుడి ఫోన్ పేలింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే…మేవాటి మొహల్లా ప్రాంతంలో నివసించే జావేద్ అనే వ్యక్తి కుమారుడు జునైద్ (13) ఒంటరిగా తన గదిలో మొబైల్ ఫోన్ తో ఆడుకుంటున్నాడు. అంతలోనే ఫోన్ పేలింది. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రాణం తప్పింది. జునైద్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని జావేద్ తెలిపారు.
