
రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. నిన్న ఉదయం ఏర్పడిన బలమైన వాయుగుండం సాయంత్రానికి బలపడి వాయుగుండంగా బలహీనపడి, ఈరోజు ఉదయం 5:30 గంటలకు బలమైన అల్పపీడనంగా మారిన విషయం తెలిసిందే. ఈ అల్పపీడనం కూడా బలహీనపడింది. ఇక మాండౌస్ తుపాను తాకిడికి భాగ్యనగరం మొత్తం వణికిపోయింది.
