ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయ నాయకత్వం లేదని, దానిని ప్రదర్శించడంలో ఆయన విఫలమయ్యారని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చైర్మన్ అసదుద్దీన్ ఒవాసీ వ్యాఖ్యానించారు. ఈ నెల 9న భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ జరిగితే ప్రభుత్వం ఈరోజు ప్రకటన విడుదల చేస్తుందని విమర్శించారు.
ఈ విషయాన్ని మీడియా బయటపెట్టకపోతే ప్రభుత్వం ప్రకటన చేసి ఉండేది కాదని అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంఘర్షణ జరిగిన చోటికి అన్ని పార్టీలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రధానికి చైనా గురించి మాట్లాడే సాహసం లేదని, మోడీ ప్రభుత్వం చైనా గురించి మాట్లాడే సాహసం చేయడం లేదని ఒవైస్ విమర్శించారు.
The post చైనా పేరు చెబితేనే భయపడుతున్న ప్రధాని మోడీ appeared first on T News Telugu
