
హైదరాబాద్: షర్మ్ షాబాద్ విమానాశ్రయంలో మళ్లీ పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈసారి ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 957 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. దాన్ని అధికారులు జప్తు చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.4.653 లక్షలుగా అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
