దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రత్యామ్నాయ పార్టీ లేని కారణంగానే దేశ ప్రజలు ఇప్పటికే బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. పాకిస్థాన్, చైనా సరిహద్దుల పేరు చెప్పి బీజేపీ మనుగడ సాగిస్తోందని విమర్శించారు. ప్రజాకూటమి అబద్ధాలు చెబుతోందని, ఆ పార్టీ చెప్పేది ఒక్కటి కూడా నిజం కాదని విమర్శించారు.
నిజం చెప్పడానికే బీఆర్ఎస్ పుట్టిందన్నారు మంత్రి కొప్పుల. బీఆర్ఎస్ అకస్మాత్తుగా పుట్టిన రాజకీయ పార్టీ కాదని, అలాంటి రాజకీయ పార్టీ దేశానికి అవసరమని అన్నారు. బీఆర్ఎస్ను చూసి బీజేపీకి చెమటలు పట్టాయని అన్నారు. కరీంనగర్ సభలో అబద్దాలు చెప్పిన జేపీ నడ్డా, బండి సంజయ్‌లకు సిగ్గుందా? అని అడుగుతాడు. బీజేపీకి కౌంట్‌డౌన్ మొదలైందని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు.
The post దేశానికి BRS పార్టీ కావాలి appeared first on T News Telugu
