ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. సైదాబాద్ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు.
ఎదురుగా ఉన్న సైకిల్‌ను తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు బోల్తా పడింది. ఘటన సమయంలో స్కూల్ బస్సులో 75 మంది విద్యార్థులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని సమీపంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాంతి దేవి జనతా విద్యాలయానికి చెందిన 75 మంది విద్యార్థులు జాంపూర్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు బస్సులో ప్రయాణించారు. దారిలో ప్రమాదం జరిగింది.
