
సిద్దిపేట, డిసెంబర్ 18: సిద్దిపేటను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు మంత్రి హరీశ్ రావు కృషి చేస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఫుట్బాల్ స్టేడియంలో అండర్-15 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ను ఆయన ప్రారంభించారు. ఆదివారం మొత్తం 15 జట్లు తలపడగా, తొమ్మిది మ్యాచ్లు ఆడాయి. సెయింట్ జాన్స్ ప్రభుత్వ బాలుర పాఠశాలపై, శ్రీ చైతన్య పాఠశాల మెరిడియన్ పాఠశాలపై, టెమిరిస్ మైనార్టీ గురుకుల పాఠశాల సెయింట్ పీటర్స్పై విజయం సాధించాయి. మరో మ్యాచ్లో ఆర్కిడ్ స్కూల్ జట్టు మెరిడియన్ స్కూల్ జట్టుపై విజయం సాధించింది.
