
TTD News |వైయస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి టిటిడి శ్రీనివాస కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మారుతీప్రసాద్, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, వీజీఓ బాలిరెడ్డితోపాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు, అర్చకుల బృందం, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేదపండితులు శ్రీవారి ఉత్సవమూర్తులను కల్యాణవేదికకు తీసుకొచ్చారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాలపై విష్వక్సేన్ ఆరాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్ప, మంగళసూత్రధారణ దశలను వేద మంత్రోచ్ఛారణలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. చివరగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమాలతో కల్యాణం ముగుస్తుంది. ప్రొద్దుటూరులోని శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంతో పులకించిపోయారు.
