అమెరికాలోని కాలిఫోర్నియాలో పెను భూకంపం సంభవించింది. ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం దీని తీవ్రత 6.4గా నమోదైంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఫెర్నాడేల్‌కు 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. భూగర్భంలో 16.1 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భూకంపం కారణంగా హంబోల్ట్ కౌంటీలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. 12,000 మందికి పైగా చీకట్లో చిక్కుకున్నట్లు సమాచారం. వాణిజ్య సముదాయాలు, నివాసాలకు విద్యుత్ సరఫరా లేకుండా పోయిందన్నారు. భూకంపం కారణంగా కొన్ని భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.
6.4 స్థాయిలో ఉత్తర కాలిఫోర్నియాలోని ప్రజలు #భూకంపం pic.twitter.com/tK4uqKBS71
– పేరులేని (@starwarslettuce) డిసెంబర్ 20, 2022
భూకంపం సమయంలో ఉత్తర కాలిఫోర్నియాలో ప్రజలు #భూకంపం pic.twitter.com/ECq8clQBI3
– సీజర్ (@జెబైటింగ్) డిసెంబర్ 20, 2022
