
విశాఖపట్నం: స్టార్ రెజ్లర్లు సంగీతా ఫోగట్, సరితా మోరే జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ టైటిల్‌ను నిలబెట్టుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల 62 కేజీల ఫైనల్లో సుమిత్రను ఓడించిన సరిత, 59 కేజీల ఫైనల్లో సిమ్రాన్‌ను అద్వితీయ రీతిలో అధిగమించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన రెజ్లింగ్ స్టార్ బజరంగ్ పునియా భార్య సంగీత, అంచనాలకు తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది.
