
ముంబై: యువ నటి తునీషా శర్మ సహనటి షీజన్ ఖాన్ను పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అరెస్టు చేశారు. అనంతరం ముంబైలోని వసాయ్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
నిన్న (శనివారం) తునీషా శర్మ టీవీ సిరీస్ సెట్లో ఆత్మహత్య చేసుకుంది. చిత్రీకరణ మధ్య బాత్రూమ్కి వెళ్లిన తునీషా శర్మ బయటకు రాకపోవడంతో సీరియల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా తునీషా మృతదేహం గాలిలో వేలాడుతూ కనిపించింది.
పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తునీషా, ఆమె భాగస్వామి షీజన్ ఖాన్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు విచారణలో తేలింది. 15 రోజుల క్రితమే షీజన్ ఖాన్ ఆమెతో విడిపోయిన సంగతి తెలిసిందే. బ్రేకప్ అయినప్పటి నుంచి తునీషా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతోందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారించారు.
తునీషా ఆత్మహత్యకు సహకరించాడన్న అనుమానంతో షీజన్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి కస్టడీకి అడిగారు. షీజన్ఖాన్ను నాలుగు రోజుల పాటు పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి కోర్టు అనుమతించడంతో అతడిని విచారిస్తున్నారు.
