
- 13 నుంచి 16 వరకు సింగిరెడ్డి తారకమ్మ స్మారక పోటీలు
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 25: వనపర్తి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ సింగిరెడ్డి తారకమ్మ స్మారక రాష్ట్ర క్రికెట్ మ్యాచ్ వనపర్తిలో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ స్టేడియంలో ఆట కొనసాగుతుందని తెలిపారు.
ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి స్థానిక నాయకులతో కలిసి క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన పోస్టర్లను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీ పుట్టపాకుల మహేష్, మార్కెటింగ్ డైరెక్టర్ సూర్యవంశం గిరి, హేమంత్ ముదిరాజ్, జోహెబ్ తదితరులు పాల్గొన్నారు.
