స్వదేశంలో శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 3 నుంచి 7 వరకు టీ20లు జరగనున్నాయి. జనవరి 10-15 వరకు వన్డే జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌లో ఆడలేకపోవచ్చునని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కోలుకోలేదు. మరోవైపు, కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. రోహిత్, రాహుల్ గైర్హాజరీలో భారత టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా, శిఖర్ ధావన్, వన్డే జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తారని బీసీసీఐ తెలిపింది.
టీ20 షెడ్యూల్:
తొలి టీ20: జనవరి 3, ముంబై
రెండో టీ20: జనవరి 5, పూణె
మూడో టీ20: రాజ్‌కోట్, జనవరి 7
వన్డే షెడ్యూల్:
తొలి వన్డే: జనవరి 10, గౌహతి
రెండో వన్డే: జనవరి 12, కోల్‌కతా
మూడో వన్డే: జనవరి 15, త్రివేండ్రం
The post శ్రీలంక సిరీస్‌కు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం appeared first on T News Telugu.
