
ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ బాల్క సుమన్ ఏపీ నేతలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల నేతలు ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో బీఆర్ఎస్ నేత బాల్కసుమన్‌ను కలిశారు. రానున్న రోజుల్లో పార్టీ దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చించారు. ఏపీలోని బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు ఇరుపక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ పార్టీని అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాలని సూచించారు.
