
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా తూప్రాన్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్‌పేటలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. రోడ్డుపై ట్యాంకర్ బోల్తా పడటంతో చౌటుప్పల్ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. తూప్రాన్‌పేట నుంచి కొయ్యలగూడెం వరకు వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు తరలించారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా అటువైపు నుంచి వాహనాలను పంపిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
