
తిరుమల: కలియుగ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో న్యాయమూర్తి చంద్రచూ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సంఘల్ వారికి తీర్థప్రసాదాలను పరిచయం చేశారు.
