
యాదాద్రి: యాదాద్రికి విచ్చేసిన భక్తుల భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. యాదాద్రి కొండపైన ఈఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 152 సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆలయ ఈఓ ఎన్.గీత, భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ శిఖరం, రింగ్ రోడ్డు, ప్రెసిడెన్షియల్ సూట్, యాదాద్రి-రాయగిరి ప్రధాన రహదారి చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొండపై ఉన్న కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశామన్నారు.
