Abdul Karim Tunda | 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ రాజస్థాన్లోని ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది.
Abdul Karim Tunda | జైపూర్ : 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ రాజస్థాన్లోని ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (టాడా) కోర్టు గురువారం నిర్దోషిగా ప్రకటించింది. తుండాకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. బాంబుల తయారీలో భాగంగా తుండా చేతి విరిగిపోయిందని పోలీసులు నిరూపించలేకపోయారు. తుండా లష్కరే తోయిబా బాంబ్ మేకర్ అని చెప్పడానికి ఎలాంటి రుజువు లేదని 2016, మార్చిలో కోర్టు తీర్పు ఇచ్చింది.
1993లో నాలుగు రైళ్లో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో తుండాతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరిని ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉంటే.. 1996 బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తుతం తుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. పలు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
