All England Badminton | ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్- 2024 సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ ఆటగాడు లక్ష్య సేన్.. ఇండోనేషియా ఆటగాడు జొన్నా చిరిస్టి చేతిలో ఓటమి పాలయ్యాడు.
All England Badminton | ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్- 2024 సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ ఆటగాడికి షాక్ తగిలింది. టోర్నమెంట్లో సెమీ ఫైనల్స్‌కు దూసుకొచ్చిన లక్ష్య సేన్.. చతికిల పడ్డాడు. ఇండోనేషియా ఆటగాడు జొన్నా చిరిస్టి చేతిలో లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. తొలి సెట్లో లక్ష్య సేన్ మీద చిరిస్టి 21-15 తేడాతో విజయం సాధించాడు. కానీ, రెండో సెట్ లో చిరిస్టిపై లక్ష్య సేన్ 21-10 తేడాతో విజయం సాధించాడు. డిసైడర్ మూడో సెట్ ప్రారంభంలో ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత చిరిస్టిని బ్రేక్ చేయడంలో లక్ష్య సేన్ విఫలమయ్యాడు. మూడో సెట్ గేమ్ లో 15-21 తేడాతో ఓడిపోయి నిష్క్రమించాడు.
