ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేష్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తుండగా.. టేకాఫ్ సమయంలో ఇంజన్ ఒకవైపుకు ఒరిగిపోయింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేష్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్‌లో పారాగ్లైడింగ్ చేస్తుండగా.. టేకాఫ్ సమయంలో ఇంజన్ ఒకవైపుకు ఒరిగిపోయింది. అయితే మంత్రి సన్నిహిత సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. దీంతో అక్కడున్న మంత్రి సురేష్, ఇతర మంత్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
జీ20 సదస్సులో భాగంగా విశాఖలో మారథాన్‌లు, సాహస క్రీడలు జరుగుతున్నాయి. మారథాన్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, రిదేశ్ రజనీ, గుడివాడ అమర్‌నాథ్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకుల ఆహ్వానం మేరకు మంత్రి సురేష్ పారాగ్లైడింగ్ కు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి మంత్రి రజిని జెండా ఊపి ప్రారంభించారు. కానీ గాలి సహకరించకపోవడంతో సురేష్ గ్లైడర్ అల్లకల్లోలంగా ఉంది. అదే సమయంలో మంత్రి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
