
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యురాలిగా అసీఫా భుట్టో జర్దారి(Aseefa Bhutto-Zardari) సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు. విపక్ష సభ్యులు ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. షాహీద్ బెనజిరాబాద్ స్థానం నుంచి ఆమె విజయం సాధించారు. గతంలో ఆ స్థానం నుంచి ఆమె తండ్రి ప్రాతినిధ్యం వహించారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అసిఫ్ అలీ జర్దారి తన సీటును కూతురికి అప్పగించేశారు. సోదరుడు బిలావల్ భుట్టో జర్దారితో కలిసి అసీఫా పార్లమెంట్‌కు వచ్చారు. స్పీకర్ అయాజ్ సాదిక్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది చరిత్రాత్మక సందర్భమని పీపీపీ పేర్కొన్నది.