రాష్ట్ర మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంటే కరెంట్ కోతల్లేవని, సాగునీటి కొరత లేదని రైతుల ముందుకు వచ్చి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో రైతులు గన్నెబొయిన మల్లయ్య, బోర్ల రాంరెడ్డిని పరామర్శించి తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రాంరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ వందల సార్లు చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ముషంపల్లికి చెందిన రాంరెడ్డి పేరు బోర్ల రాంరెడ్డిగా మారింది. గన్నెబొయిన మల్లయ్య యాదవ్, బోర్ల రాంరెడ్డి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది. అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి రావడం జరిగింది. రాంరెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, కొంతమంది మహిళలను కలిసినా, గత 10 ఏండ్లలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పారు. కానీ…
Author: Telanganapress
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సుప్రీంకోర్టులో దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ పినాక పాణి మొహంతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జీవించి లేని నేతలపై నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఆరోపణలు చేశారని, మహాత్మా గాంధీని కూడా విడిచిపెట్టలేదని మండిపడింది. April 2, 2024 / 02:10 AM IST న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నిజాలు నిగ్గు తేల్చాలంటూ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సుప్రీంకోర్టులో దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం పిటిషనర్ పినాక పాణి మొహంతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జీవించి లేని నేతలపై నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా ఆరోపణలు చేశారని, మహాత్మా గాంధీని కూడా విడిచిపెట్టలేదని మండిపడింది. తాను వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (ఇండియా) కటక్ జిల్లా కార్యదర్శినని పినాక పాణి ఈ పిటిషన్‌లో…
The proposed peace summit in Switzerland can be a good starting point to find a lasting solution and end the Ukraine war Published Date – 1 April 2024, 11:50 PM Representational Image India has the required diplomatic heft to play a peacemaker role in the ongoing Russia-Ukraine war. This was demonstrated once again during the recent engagements that New Delhi had with both the warning nations. There is a growing international recognition of New Delhi’s role as a peace advocate in the region. Ukrainian Foreign Minister Dmytro Kuleba’s visit to India last week — the first…
రాష్ట్రంలోని బీజేపీ నేతలను తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. వీళ్లే భక్తులు అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం కూడా దేవుళ్లను పూజిస్తామని, తాను రెండు నిమిషాల్లోనే హనుమాన్ చాలీసా చదివేస్తానని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదు. బీజేపీ మాట వింటే జోడి.. వినకపోతే తెల్లారీ ఈడీ.. ఇది ఇవాళ ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. విదేశాల్లో నల్లధనం తెస్తామని, ఒక్కోక్కరి అకౌంట్‌లో 15 లక్షలు వేస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ పదేండ్లలో ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను పొట్టన పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారు. బీజేపీ పాలనలో ఈ దేశంలో…
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా భారీగా ఆదాయం అంచనావేసుకున్న కేంద్ర ప్రభుత్వానికి మళ్లీ నిరాశే ఎదురైంది. 2023-24 ఆర్థిక సంవత్సరం పీఎస్‌యూల్లో వాటాల విక్రయంతో రూ.30 వేల కోట్ల నిధులు సమకూరవచ్చునని సార్వత్రిక బడ్జెట్‌లో అంచనావేయగా.. దీనిని అందుకోలేకపోయింది. రూ.16,507 కోట్లు మాత్రమే సమీకరించింది. 10 సంస్థల్లో వాటాల విక్రయంతో ఈ నిధులు సమకూరాయి. వీటిలో కోల్ ఇండియాలో వాటా విక్రయిస్తే అత్యధికంగా రూ.4,186 కోట్లు వచ్చాయి. కాగా, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో మోదీ సర్కారు డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని మించి నిధులను సేకరించింది. Source link
Big powers are busy with other conflicts in West Asia and Europe and it’s here that India can play a crucial role Published Date – 1 April 2024, 11:59 PM Afghanistan is mineral-rich country and by connecting energy-rich Central and West Asia to South Asia, both Afghanistan and Pakistan will benefit By Dhananjay Tripathi When the United States of America exited Afghanistan in August 2021, it was a long war of 20 years that came to an end. Every war has its cost, both material and human. For example, America invested almost $2.3 trillion during its…
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదాపడింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లో ఉండటంతో రేపు(మంగళవారం) జరగాల్సిన లెక్కింపు ప్రక్రియను జూన్ 2వ తేదీకి వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేయాలని తెలిపింది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తైన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఈసీ ఆదేశించింది. దీంతో జూన్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ గత గురువారం జరిగింది. ఓటింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను మహబూబ్ నగర్ బాయ్స్ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ…
పక్కాగా ఎన్నికల కోడ్ అమలు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు, విస్తృతంగా వాహన తనిఖీలు కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెల 29 వరకు అవకాశం భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల విధులు, కోడ్ పరిశీలనకు 5,629 మంది నియమితులయ్యారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లాలోని ఐదు నియోజకవర్గాల అసిస్టెంట్ ఎన్నికల అధికారులు సభలు, సమావేశాలు, అవగాహన సదస్సులు ప్రారంభించారు. కలెక్టర్ ప్రియాంక ఆల ఐదు నియోజకవర్గాలకు ఐదుగురు ఏఆర్వోలను నియమించారు. వీరు ఎన్నికల విధి విధానాలపై రాజకీయ నాయకులకు అవగాహన కల్పిస్తూ, ఓటు హక్కుపై వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ వృద్ధులు,…
Issues pertaining to law and order situation, setting up of check posts and daily seizure reports etc were discussed during the meeting. Published Date – 1 April 2024, 10:50 PM Hyderabad: Chief Secretary A Santhi Kumari on Monday directed the officials to enforce the model code of conduct strictly for ensuring free, fair and peaceful conduct of the Lok Sabha elections in the State. The Chief Secretary held a meeting with officials and reviewed the implementation of the model code of conduct. Issues pertaining to law and order situation, setting up of check posts and daily…
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడిన తర్వాత కార్యకర్తల్లో జోష్ ఎక్కువగా కనబడుతోంది. కసి ఎక్కువగా కనబడుతోంది. స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నికలో పని చేసిన ఉత్సాహం ఇవాళ మీలో కనబడుతోంది. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనబడుతుంది. ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకుని, అందరితో సమావేశాలు పెట్టించి చివరి క్షణంలో పార్టీ మారారు. ఇలాంటి ద్రోహులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు హరీశ్‌రావు. పార్టీ మారడమంటే కార్యకర్తల మనోస్థైరాన్ని దెబ్బతీయడం, పార్టీని అవమానపరచడమేనని హరీశ్‌రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో శ్రీహరికి…