అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 22: అయోధ్య బాలరాముడు నేటి నుంచి(మంగళవారం) సాధారణ భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. భవిష్యత్తులో దేశంలోనే ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా మారే అయోధ్య రామ మందిరంలో రామ్‌లల్లా దర్శనం, హారతి వేళల వివరాలను శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
హారతి/దర్శనం పాస్‌లు ఎలా పొందాలి?
బాలరాముడి దర్శనానికి భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా పాస్‌లు పొందవచ్చు. అయితే ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతానికి ప్రారంభం కాలేదు. అప్‌డేట్స్ కోసం ట్రస్టు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ బుకింగ్ ఎలా..
- అయోధ్య రామాలయ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది.
- మై ఫ్రొఫైల్’ అనే సెక్షన్‌పై క్లిక్ చేసి, హారతి/దర్శన స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి.
- అవసరమైన వివరాలు సమర్పించి పాస్ బుకింగ్ చేసుకొన్న తర్వాత.. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
- ఆలయం ప్రాంగణంలోని కౌంటర్ వద్ద పాస్ తీసుకొని దర్శనానికి వెళ్లొచ్చు.
ఆఫ్‌లైన్‌లో ఎలా..
ఆలయ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి, చెల్లుబాటు అయ్యే ఏదైనా ప్రభుత్వ ధ్రువీకరణ ఐడీ సమర్పించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో పాస్‌లు పొందవచ్చు.
దర్శనం/హారతి వేళలు
- రామ్‌లల్లా దర్శన సమయం- ఉదయం 7.00-11.30
- మధ్యాహ్నం 2.00-7.00
- జాగరణ్/శృంగార్ హారతి ఉదయం 6.30
- సంధ్యా హారతి సాయంత్రం 7.30
