B tax | కాంగ్రెస్ పార్టీ(Congress party) బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) ఆరోపించారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ(Congress party) బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Maheshwar Reddy) ఆరోపించారు. బిల్లుల క్లియరెన్స్ కోసం బీ ట్యాక్స్(B tax) వసూలు చేస్తున్నారు. బీ ట్యాక్స్ పేరుతో 8 నుంచి 9 శాతం కమీషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ ఏమో నాకు తెలియదన్నారు. భూ కబ్జాలు చేసిన కేకే, రామ్మోహన్ కాంగ్రెస్‌లో చేరారు. హస్తం పార్టీలో చేరగానే వాళ్లు కడిగిన ముత్యాలు అయ్యారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
