Bengaluru Cafe Blast | బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితులైన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా (Abdul Matheen Ahmed Taahaa), ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ (Mussavir Hussain Shazib) లు.. గురువారం సాయంత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారుల చేతికి చిక్కేవరకు వేర్వేరు రాష్ట్రాల్లో పలు మకాంలు మారుస్తూ తప్పించుకుతిరిగారు.

Bengaluru Cafe Blast : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో నిందితులైన అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా (Abdul Matheen Ahmed Taahaa), ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్ (Mussavir Hussain Shazib) లు.. గురువారం సాయంత్రం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారుల చేతికి చిక్కేవరకు వేర్వేరు రాష్ట్రాల్లో పలు మకాంలు మారుస్తూ తప్పించుకుతిరిగారు. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఆ మేరకు కోల్‌కతాలోని ఇక్బాల్‌పూర్ ఏరియాలోగల డ్రీమ్ గెస్ట్ హౌస్‌లో నిందితులిద్దరూ రూమ్ బుక్ చేసుకుంటున్న దృశ్యాలు కింది వీడియోలో ఉన్నాయి.
#WATCH | West Bengal: CCTV visuals from Dream Guest House in Kolkata, where the two prime suspects of The Rameswaram Cafe blast case stayed from 25th March to 28th March using fake identity.
Both accused have been sent to police custody for 10 days.
(Source: Dream Guest House) pic.twitter.com/TxrCFNkNfr
— ANI (@ANI) April 13, 2024
కేసు దర్యాప్తులో భాగంగా వారికి లభ్యమైన సీసీ టీవీ పుటేజ్‌ను ఎన్‌ఐఏ అధికారులు బయటపెట్టారు. డ్రీమ్ గెస్ట్‌హౌస్‌లో నిందితులు మార్చి 25 నుంచి 28వ తేదీ వరకు మకాం వేసినట్లు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి మిడ్నాపూర్‌కు వెళ్లారు. డ్రీమ్ గెస్ట్‌హౌస్‌కు రాకముందు కూడా వివిధ ప్రాంతాల్లో మకాంలు మారుస్తూ చివరికి బెంగాల్‌కు చేరుకున్నారు. ఎక్కడి మకాం మార్చినా పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో కార్డులు వినియోగించలేదు. అన్ని చోట్లా నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు చేశారు.
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ మార్చి 1 జరుగగా, మార్చి 3న ఎన్‌ఐఏ ఈ కేసును టేకప్ చేసింది. మార్చి 3 నుంచి కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 18 లొకేషన్‌లలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. చివరికి పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాకు 180 కిలోమీటర్ల దూరంలోని చిన్న పట్టణం కంతిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులిద్దికీ వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించింది. కాగా రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.