Bhatti Vikramarka | సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.
హైదరాబాద్ : సౌర విద్యుత్తు(Solar power) ఉత్పత్తిని గ్రామీణ ప్రాంతాల్లోనూ(Rural areas) ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేస్తమని చెప్పారు. సౌర విద్యుత్‌తో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు.
