
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి మళ్లీ మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. పలువురు నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా బీజేపీకి వీడ్కోలు పలికారు. రాపోలు ఆనంద్ భాస్కర్ బుధవారం జేపీ నడ్డాకు రాజీనామా లేఖను అందజేశారు.
మరి అన్నీ సవ్యంగా జరిగితే రెండు మూడు రోజుల్లో ఆయన టీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. ఆదివారం ఆయన ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమల అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.
813427