BRS పార్టీ | హైదరాబాద్: BRS పార్టీలో చేరికల పరంపర కొనసాగుతోంది. మహారాష్ట్రలోని వివిధ పార్టీలకు చెందిన చురుకైన మహిళా నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మహిళా నేతలందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో అత్యధిక వాటాలను మహిళలకే కేటాయిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇందుకు బీఆర్‌ఎస్ నాయకులు, సీఎం కేసీఆర్ దార్శనికతలే ప్రధాన కారణమన్నారు.