CEC Rajiv Kumar | భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోంశాఖ ఆయనకు ‘Z’ కేటగిరి భద్రత కల్పించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

CEC Rajiv Kumar : భారత ప్రధాన ఎన్నికల అధికారి (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోంశాఖ ఆయనకు ‘Z’ కేటగిరి భద్రత కల్పించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భద్రతకు ఎలాంటి ముప్పు ఉందని ఐబీ చెప్పిందో మాత్రం కేంద్రం వెల్లడించలేదు.
భద్రత పెంచడంతో ఇప్పుడు ‘Z’ కేటగిరీ కింద సీఈసీ రాజీవ్‌కుమార్‌కు నిత్యం 33 మంది సీఆర్‌పీఎఫ్ కమాండోస్ రక్షణ కల్పించనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు ప్రధాన ఎన్నికల అధికారికి భద్రత పెంచడం అసలు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ను పెంచింది. అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ లాంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇది కూడా సీఈసీ సెక్యూరిటీ పెంపునకు ఒక కారణం అయివుండవచ్చనే చర్చలు వినిపిస్తున్నాయి.