Clothes for Lord Ram | అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు.
లక్నో: అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగనున్నది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరాముడి కోసం ప్రత్యేకంగా నేసిన వస్త్రాలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత రాత్రి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేశారు.
ఈ ప్రత్యేక వస్త్రాలను ఏకంగా 12 లక్షల మంది భక్తులు నేశారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్టు ‘శ్రీరాముడి కోసం రెండు పోగులు (దో ధాగే శ్రీరామ్‌కే లియే)’ పేరుతో ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా పుణె జిల్లాలోని చేనేత కార్మికులందరూ తలో చెయ్యివేసి ఈ వస్త్రాలు నేశారు.
పుణె హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు ఆ వస్త్రాలను యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేతుల మీదుగా శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా పుణె చారిటబుల్ ట్రస్ట్ బృందాన్ని యోగీ ఆదిత్యనాథ్ అభినందించారు.
