CM Revant Reddy | సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రంజాన్(Ramzan) వేడుకల్లో పాల్గొన్నారు. గురువారం రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ(Shabbir Ali) నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు ఆరగించారు. కాగా, రంజాన్ పర్వదినం లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ మేరకు ఒక ప్రకటనలో ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు.