Darshan Mogiliah | పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య(Darshan Mogiliah )డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను(Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య(Darshan Mogiliah )డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను(Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం నెలకు రూ.25వేల ఫించన్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వచ్చే మార్చి నెల నుంచి ఫించన్ ఇప్పించాలని కోరారు. అలాగే నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసుల కుంట గ్రామంలో తనకు ఇందిరమ్మ ఇల్లు (Indiiramma house) మంజూరు చేయాలని కోరారు. అనంతరం బీమ్లా నాయక్ సినిమాలో రాసిన పాటను ఈసందర్భంగా డిప్యూటి సీఎంకు పాడి మొగులయ్య వినిపించారు.
