Dog attacked | రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dog) చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి.

హైదరాబాద్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Stray dog) చెలరేగి పోతున్నాయి. ఐదేండ్ల లోపు పిల్లలనే లక్ష్యంగా చేసుకుని ప్రతాపం చూపిస్తున్నాయి. కొంత కాలంగా నగరంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా శుక్రవారం దుండిగల్‌లో(Dundigal) వీధి కుక్క ఓ చిన్నారిపై దాడిచేసి(Dog attacked) గాయపర్చాయి.
ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల అనన్య అనే చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. గాయపడిన అనన్యను దవాఖానకు తరలించారు. కాగా, చిన్నారిపై దాడి చేసిన కొద్ది సేపటికే వీధి కుక్కలు మరో మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వీధి కుక్కల బారి నుంచి తమను కాపాడాలని, చిన్నారులకు రక్షణ కల్పించాలని మున్సిపాలిటీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.