DSP Gangadhar | గత సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర(Stephen Ravindra) కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్(DSP Gangadhar) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)కి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ : గత సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర(Stephen Ravindra) కమాండ్ కంట్రోల్ డీఎస్పీ గంగాధర్(DSP Gangadhar) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)కి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే..గంగాధర్ నార్సింగిలో సీఐగా ఉన్నప్పుడు భూ వివాదంలో(Land disputes) జోక్యం చేసుకున్నాడని సస్పెండ్ చేశారు.
అయితే తనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఏకపక్షంగా నాటి సీపీ సస్పెండ్ చేశారని, దీంతో తాను పదోన్నతి పొందే అవకాశం కోల్పోయానని ఆరోపిస్తూ సీఎంకు ఫిర్యాదు చేశాడు. నిబంధనలు అతిక్రమించిన సీపీపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని గంగాధర్ కోరారు.
