Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారని ఎస్బీఐ వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారని ఎస్బీఐ వెల్లడించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బాండ్ల కేసులో ఇవాళ ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి బాండ్లపై డేటాను సమర్పించినట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. ఈసీకి పెన్‌డ్రైవ్‌లో ఆ సమాచారాన్ని చేరవేసినట్లు ఎస్బీఐ చెప్పింది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్వర్డ్ ప్రొటెక్షన్‌తో ఇచ్చినట్లు ఎస్బీఐ పేర్కొన్నది. 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ వరకు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది.
