Errabelli Dayaker Rao | పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైలుకు పోతే పోతా.. కానీ పార్టీని మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు
Errabelli Dayaker Rao | పాలకుర్తి : పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. తాను జైలుకు పోతే పోతా.. కానీ పార్టీని మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. హామీల అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు
గతంలో రైతుల కోసం మూడు సార్లు పోలీసులతో దెబ్బలు తిన్నాను. జైలుకు పోయాను అని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు. పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తి.. నాలుగు సార్లు చిత్తుచిత్తుగా ఓడిన కడియం శ్రీహరి తనపై విమర్శలు చేయడం సరికాదు. తన 40 ఏండ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. కడియం కావ్య చిత్తుచిత్తుగా ఓడబోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్గా మార్చే ఆలోచన చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
