FIFA World Cup Qualifier : ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్‌లో భారత జట్టు(Team India) ఓటమిపాలైంది. మంగళవారం అఫ్గనిస్థాన్(Afghanistan)తో జరిగిన పోరులో సునీల్ ఛెత్రీ సేన అనూహ్యంగా కంగుతిన్నది. తన 150వ మ్యాచ్‌లో కెప్టెన్ గోల్..
FIFA World Cup Qualifier : ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్‌లో భారత జట్టు(Team India) ఓటమిపాలైంది. మంగళవారం అఫ్గనిస్థాన్(Afghanistan)తో జరిగిన పోరులో సునీల్ ఛెత్రీ సేన అనూహ్యంగా కంగుతిన్నది. తన 150వ మ్యాచ్‌లో కెప్టెన్ గోల్ కొట్టినా 1-2తో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో ఫిఫా ర్యాంకింగ్స్‌లో టీమిండియా 122వ స్థానానికి పడిపోయింది. అంతేకాదు వరల్డ్ కప్ బెర్తును కూడా మరింత సంక్లిష్టం చేసుకుంది.
భారత్, అఫ్గనిస్థాన్‌ల మధ్య గువాహటిలో మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. మొదటి అర్థ భాగంలోనే ఛెత్రీ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దాంతో, భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే. రెండో అర్థ భాగంలో పుంజుకున్న అఫ్గన్ జట్టు రెండు గోల్స్ సాధించింది. టీమిండియా ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా గోల్ చేయలేకపోయారు. వరల్డ్ కప్ బెర్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా జూన్‌లో ఖతార్‌తో తలపడనుంది.
