Fire accident | జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్(Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పోలీసుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్ (Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇందుకు భువనగిరి 1, ఆలేరు 1 ఫైర్ ఇంజన్లను ఉపయోగించి దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ తోనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

