Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Food Habits | తిండి తిప్పలు.. మితం తప్పితే అమృతమైనా విషమే-Namasthe Telangana

TelanganapressBy TelanganapressFebruary 13, 2024No Comments

మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి.

February 13, 2024 / 08:41 AM IST
Food Habits | తిండి తిప్పలు.. మితం తప్పితే అమృతమైనా విషమే

Food Habits | మితం తప్పితే అమృతమైనా విషమే. ఆహారం విషయంలోనూ ఈ మాట వర్తిస్తుంది. తినాల్సిన దానికంటే ఎక్కువగా తిన్నా.. చాలా తక్కువగా తిన్నా.. తినకూడని వాటివైపు నాలుక లాగినా అవన్నీ రుగ్మతల కిందికే వస్తాయి. అంతేకాదు.. వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు వేధిస్తుంటాయి. శరీర బరువు, ఆకారం గురించి చింత ఎక్కువే. ఆయా లక్షణాలను బట్టి ఆహార రుగ్మతలను రకరకాలుగా వర్గీకరిస్తారు. తిండికి సంబంధించిన రుగ్మతలు శారీరక ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తాయి. వీటిని దూరం చేసుకోవడానికి మానసిక నిపుణుల సహకారం అవసరం అవుతుంది. ఇవన్నీ సాధారణంగా టీనేజీలో మొదలవుతాయి. ఇతర వయసుల వారిలో కూడా వృద్ధి చెందుతాయి. తగిన చికిత్స తీసుకోకపోతే మన ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తాయి.

Chocolates

ఎనోరెగ్జియా నర్వోసా

తిండికి సంబంధించిన రుగ్మతల్లో అతి సహజమైంది ఎనోరెగ్జియా నర్వోసా. కౌమార దశలో మొదలయ్యే ఈ సమస్య పురుషులతో పోలిస్తే.. స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారు తక్కువ బరువు ఉన్నా.. లావైపోతున్నట్టు అపోహపడతారు. పరిమితంగా తినడం లేదంటే పళ్లాలకు పళ్లాలే ఖాళీచేయడం.. ఇందులో రెండు వర్గాలవారూ ఉంటారు. అయితే, ఎనోరెగ్జియా నర్వోసా వ్యక్తులు ప్రధానంగా.. బరువు పెరుగుతామనే భయంతో మితంగా ఆహారం తీసుకోవడంపైనే దృష్టిసారిస్తారు.

బులీమియా నర్వోసా

ఎనోరెగ్జియాలానే బులీమియా కూడా కౌమార దశలోనే వృద్ధి చెందుతుంది. ఇది సాధారణంగా మహిళల్లో కనిపిస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారు ప్రత్యేకమైన సమయాల్లో కుంభాలకు కుంభాలు తింటారు. పొట్ట పగిలేవరకు లాగిస్తూనే ఉంటారు. వాంతి చేసుకోవడం, ఉపవాసాలు ఉండటం, విరేచనకారులను తీసుకోవడం, అధికంగా వ్యాయామం చేయడం ద్వారా తమ శరీరంలో పేరుకు పోయిన క్యాలరీలను కరగదీసుకుంటారు. అలా అని వీళ్లు ఊబకాయులూ కాదు. సాధారణమైన బరువునే కలిగి ఉంటారు.

బింజ్‌ ఈటింగ్‌ డిజార్డర్‌

ఇదీ సాధారణంగా కనిపించే ఆహార రుగ్మతే. బింజ్‌ ఈటింగ్‌ డిజార్డర్‌ కౌమారంలో, ప్రౌఢ వయసు తొలిదశలో మొదలవుతుంది. కొంతమందిలో తర్వాత దశల్లో కూడా కనిపిస్తుంది. ఈ సమస్య ఉన్నవారు కార్బొహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినకుండా ఉండలేరు. తిండికి తగిన వ్యాయామం చేసి క్యాలరీలు కరిగించుకోవాలని కూడా అనుకోరు. దీంతో ఊబకాయం ఊబిలో చిక్కుకుంటారు.

పైకా

ఇది అంతగా తెలియని తిండి రుగ్మత. ఆహార పదార్థాలు కానివాటి మీద మనసు పడటమే పైకా లక్షణం. పిల్లలు, కౌమారంలో ఉన్నవారు, పెద్దల్లో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. మంచు, దుమ్ము, మన్ను, చాక్‌పీస్‌, సబ్బు, కాగితం, వెంట్రుకలు, బట్టలు, ఉన్ని, గులకరాళ్లు, డిటర్జెంట్‌ సబ్బు లాంటివాటిని ఆరగించేందుకు ఆసక్తి చూపుతారు. ఈ లక్షణాలు ఎక్కువగా పిల్లలు, గర్భిణులు, మానసిక వైకల్యం ఉన్నవారిలో
కనిపిస్తాయి. పైకా రుగ్మత ఉన్నవారిలో.. శరీరం విష ప్రభావానికి గురివడం, ఇన్ఫెక్షన్లు, పేగులకు గాయాలు, పోషక లోపాలు కనిపిస్తాయి. ఒక్కోసారి, తినే పదార్థాల్ని బట్టి మరణం కూడా సంభవిస్తుంది.

రూమినేషన్‌ డిసీజ్‌

ఈ రుగ్మత ఉన్నవాళ్లు మింగిన ఆహారాన్ని మళ్లీ నోట్లోకి తెచ్చుకుంటారు. అంతేకాదు దానిని మళ్లీ మింగడమో, లేదంటే బయటికి ఉమ్మేయడమో చేస్తారు. నెమరువేసే రుగ్మత తిన్న మొదటి 30 నిమిషాలలోపు జరుగుతుంది. అదీ స్వయం ప్రేరితంగానే. ఇది శైశవంలో, బాల్యంలో,
పెద్దయ్యాక.. ఎప్పుడైనా తలెత్తవచ్చు. ఈ సమస్య ఉన్న వయోజనులు ఆహార పరిమాణం తగ్గించుకోవడం ద్వారా అనారోగ్య కరమైన రీతిలో బరువు తగ్గిపోతారు.

Food

ఎవాయిడెంట్‌/ రిస్ట్రిక్టివ్‌ ఫుడ్‌ ఇన్‌టేక్‌ డిజార్డర్‌ (ఏఆర్‌ఎఫ్‌ఐడీ)

తిండిపై ఆసక్తి లేకపోవడం ప్రధాన లక్షణం. కొన్ని వాసనలు, రంగులు, ఆకారాలు, మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్నవి దూరం పెట్టడం.. మొదలైన కారణాల వల్ల ఆహారం తీసుకునేందుకు ఇష్టపడరు. ఈ రుగ్మతను చాలామంది ఒక సమస్యగా కూడా భావించరు. ఇవే కాకుండా.. ఏ అర్ధరాత్రో ధిగ్గునలేచి దొరికింది తినడం, నలుగురూ ఏం అనుకుంటారో అనేది పట్టించుకోకుండా.. పళ్లెం మొత్తం ఊడ్చుకుని ఆరగించడం.. ఇలాంటి విపరీతమైన అలవాట్లను కూడా ఆహార రుగ్మతలుగానే పరిగణిస్తారు.

కారణాలు అనేకం

తిండితోముడిపడిన రుగ్మతలకు కచ్చితమైన కారణాలు తెలియవు. ఆరోగ్య నిపుణులు మాత్రం, మిగిలిన అంశాలతోపాటు జన్యువులనూ ముద్దాయిలుగా తేల్చుతున్నారు. ఆత్మన్యూనత, జిహ్వ చాపల్యం, మనసు మీద అదుపు లేకపోవడం (ఇంపల్సివ్‌ బిహేవియర్‌), సమస్యాత్మకమైన సంబంధాలు, ఒత్తిడి, ఒంటరితనం తదితర విషయాలతోనూ ముడిపెడుతున్నారు.

నిర్ధారణ- చికిత్స

ఆ వ్యక్తి ఆహారపు అలవాట్లు, లక్షణాలు, శరీర సంకేతాలను బట్టి వైద్యులు ఆహార రుగ్మతలను నిర్ధారిస్తారు. ఎవరికైనా ఆ జాడ్యం ఉందని తేలితే తగిన చికిత్స సూచిస్తారు. ఒక్కోరకం ఆహార రుగ్మతకు ఓ ప్రత్యేక చికిత్స ఉంటుంది. కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ థెరపీ, ఫ్యామిలీ బేస్డ్‌ థెరపీ లాంటి మానసిక చికిత్సల ద్వారా వాటిని దూరం చేయవచ్చు. నియమిత వేళల్లో పరిమితంగానే అయినా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, సకాలంలో మందులు వాడటం తదితర మార్గాల ద్వారా వ్యాధిని దూరం చేసుకోవచ్చు.

నివారించవచ్చా?

తిండి రుగ్మతలను నివారించేందుకు ప్రత్యేకమైన మార్గాలంటూ లేవు. అయితే, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లను పరిచయం చేయాలి. అనారోగ్యకర ఆహారం దుష్ప్రభావాలను వివరించాలి. బంధు మిత్రులు..
ఎవరైనా ఆహార రుగ్మతలతో బాధపడుతున్న విషయాన్ని గమనిస్తే.. ఎగతాళి చేయకూడదు. ఆ ఊబి నుంచి బయటపడటానికి మన వంతు సహకారం అందించాలి.

ముప్పు కారకాలు

కుటుంబ చరిత్ర, ఆందోళన, కుంగుబాటు, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ లాంటి మానసిక సమస్యలు, కఠినమైన డైటింగ్‌, దీర్ఘకాలం పాటు తీవ్రమైన ఆకలిని అనుభవించడం (స్టార్వేషన్‌), ఒత్తిడి లాంటివి తిండికి సంబంధించిన రుగ్మతలకు దారితీస్తాయి నిపుణులు చెబుతున్నారు.

ఇవీ లక్షణాలు..

ఎనోరెగ్జియా నర్వోసా

ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉన్నా, పరిమిత ఆహారమే తీసుకుంటున్నా బరువు పెరుగుతామనే భయం, ఆరోగ్యకరమైన బరువును ఇష్టపడకపోవడం. అంతేకాదు, ఏ సినీతారలతోనో పోల్చుకుని ఆకృతి గురించి బాధపడుతుంటారు.

బింజ్‌ ఈటింగ్‌ డిజార్డర్‌

నాలుక మీద ఎలాంటి నియంత్రణా లేకుండా తిండికి ఎగబడటం.

పైకా

మంచు, దుమ్ము, మన్ను, చాక్‌పీస్‌, సబ్బు, కాగితం, వెంట్రుకలలాంటి ఆహార పదార్థాలు కానివాటిపై నాలుక లాగుతుంది.

రూమినేషన్‌ డిజార్డర్‌

జనంలో ఉన్నప్పుడు తిండి పరిమాణం విషయంలో మరింత జాగ్రత్త పడతారు.

ఎవాయిడెంట్‌/ రిస్ట్రిక్టివ్‌ ఫుడ్‌ ఇన్‌టేక్‌ డిజార్డర్‌

ఆరోగ్యకరమైన ఆహారాన్ని దూరం పెట్టడం, తీవ్రంగా బరువు తగ్గడం, వయసుకు తగినంత బరువు ఉండకపోవడం, పోషకాలు తక్కువగా ఉండటం.

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.