Former MLA | ప్రముఖ వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు (Dr. Sudhakar Rao) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
మహబూబాబాద్ : ప్రముఖ వైద్యులు, అంతర్జాతీయ స్థాయి ఎండోక్రైనాలజిస్ట్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్ రావు (Dr. Sudhakar Rao) బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొన్నిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల యశోద ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్టు దవాఖాన వర్గాలు తెలిపాయి.
1969లో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామలో అరెస్టు అయ్యారు. 1975 నుంచి సామాన్య జనానికి వైద్యసేవలందించిన డాక్టర్‌నెమురుగోమ్ముల సుధాకర్ రావు 1999 నుంచి 2004వరకు పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే(MLA) గా పనిచేశారు. 2010 తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. చివరగా ఆయన బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ గా పనిచేశారు. సుధాకర్‌రావు తండ్రి యెతి రాజారావు మంత్రిగా, తల్లి విమలాదేవి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.
