
Gaami | టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ గామి (Gaami). విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి హీరోయన్‌గా నటిస్తోంది. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం నుంచి తాజా అప్‌డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది టీం. విశ్వక్‌సేన్ టీం త్వరలోనే బాక్సాఫీస్‌ను టచ్ చేయనుంది.. ఫిబ్రవరి 7న బిగ్ అప్‌డేట్ అంటూ ఇంట్రెస్టింగ్ లుక్ విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇదే రోజు రాబోతుందని అర్థమవుతుండగా.. ఇంతకీ ఆ వార్త ఏంటో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే. గామి రన్ టైం 2 గంటల 24 నిమిషాలుండబోతున్నట్టు ఇన్‌సైడ్ టాక్.. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే గామి కోసం విశ్వక్ సేన్, చాందినీ చౌదరి కూడా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు అప్‌డేట్ వచ్చిందని తెలిసిందే. విశ్వక్ సేన్ దీంతోపాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari)లో నటిస్తున్నాడు. విశ్వక్ సేన్ 11 (VS 11)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ రవితేజ దర్శకత్వంలో విశ్వక్ సేన్ 10 (VS 10)లో కూడా నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
#Gaami TOUCHING THE BOX OFFICE SOON
Big Update on February 7th
Stay tuned!@VishwakSenActor @iChandiniC @mgabhinaya #KarthikSabareesh #VidyadharKagita #NareshKumaran @_Vishwanath9 @Synccinema @vcelluloidsoffl @UV_Creations @adityamusic pic.twitter.com/e1tVXdC3to
— UV Creations (@UV_Creations) February 6, 2024
Gaami2
చాందినీ చౌదరి గామి అప్‌డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made
pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్‌సేన్, నేహాశెట్టి డ్యాన్స్..


