Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్‌లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్‌లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు.
గాంధీనగర్: అదానీ గ్రూపు చైర్మెన్ గౌతమ్ అదానీ(Gautam Adani) కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్‌లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్‌లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు. గాంధీనగర్‌లో జరుగుతున్న వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన నేతలు కూడా ఈ ఈవెంట్‌కు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2047 నాటికి మనది అభివృద్ధి దేశంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రపంచ పఠంపై భారత్‌ను శక్తివంతమైన దేశంగా నిలిపారని, ఆత్మనిర్భర్ భారత్‌ను రూపొందిస్తున్నట్లు అదానీ తన ప్రకటనలో మోదీని మెచ్చుకున్నారు.
