Girl Suicide | దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.
Girl Suicide | బెంగళూరు : దొంగతనం నెపంతో ఓ టీచర్ విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది. దీంతో వేధింపులు తాళలేక విద్యార్థినిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని భగల్కోట్లో వెలుగు చూసింది.
భగల్కోట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ 14 ఏండ్ల విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. ఆ బాలిక రూ. 2 వేలు దొంగిలించినట్లు టీచర్ జయశ్రీ మిశ్రికోటి వేధించింది. హెడ్మాస్టర్ కేహెచ్ ముజావర్ కూడా బాలికను నిందించాడు. హెడ్మాస్టర్, టీచర్ వేధింపులు భరించలేక విద్యార్థినిని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే దొంగతనం నెపంతో బాలిక బట్టలు విప్పించి, తనిఖీ చేసినట్లు తోటి విద్యార్థులు పేర్కొన్నారు. తనను స్కూల్ నుంచి బహిష్కరిస్తే అవమానంగా ఉంటుందని బాధితురాలు ఎనిమిదో తరగతి విద్యార్థిని వద్ద చెప్పినట్లు తెలిసింది. ఈ పరిణామాల మధ్య బాధిత బాలిక ఈ నెల 15న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
