Harish Rao | ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్ తీరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు.
Harish Rao | ప్రచారంలో అబద్ధం.. పాలనలో అసహనం.. ఇదే కాంగ్రెస్ తీరు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామన్నారు. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువాలన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశం స్ఫూర్తినిచ్చేలా జరిగిందన్నారు. పార్టీ బలోపేతం కావడానికి కార్యకర్తలు, నాయకులు మంచి సూచనలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు కోసం క్రమశిక్షణతో పనిచేయాలని సంకల్పించామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎన్నికల కోడ్ రాకముందే అమలయ్యేలా పోరాడాలని నిర్ణయించాన్నారు.
