Health Tips : వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం సహజం. మనలో చాలా మంది వయసు మీదపడే కొద్దీ బరువు పెరుగుతుంటారు.
Health Tips : వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకోవడం సహజం. మనలో చాలా మంది వయసు మీదపడే కొద్దీ బరువు పెరుగుతుంటారు. బరువు తగ్గేందుకు వ్యాయామంతో చెమటలు కక్కుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గకపోవడంతో నిరాశ చెందుతుంటారు. అయితే వర్కవుట్లతో శరీరాన్ని కష్టపెట్టడంతో పాటు సరైన ఆహారం కూడా బరువు తగ్గే ప్రక్రియలో కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సరైన డైట్ చార్ట్‌ను రూపొందించుకుని ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. ఇక ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా తమ ఆహారంలో ఫైబర్ అధికంగా తీసుకోవాలి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో జీవక్రియలు మందగించడంతో అది నేరుగా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందిన జీర్ణక్రియ మెరుగయ్యేందుకు విధిగా మన ఆహారంలో ఫైబర్‌తో కూడిన పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవాలి. ఇది బరువు తగ్గించడంతో పాటు పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఫైబర్ అధికంగా తీసుకోవడం ద్వారా టైప్ 2 మధుమేహం, హృద్రోగాల బారినపడే ముప్పును గణనీయంగా తగ్గిస్తుందని లాన్సెట్ జర్నల్ తెలిపింది. బరువు తగ్గాలనుకునే వారు ఫైబర్‌ను అధికంగా తీసుకోవడంతో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాలను మితంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో క్యాల్షియం తగినంత ఉండేలా చూసుకోవడంతో పాటు స్మోకింగ్‌ను అవాయిడ్ చేస్తూ ఆల్కహాల్‌ను పరిమితంగా తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Read More :
Loksabha Polls: హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది తరలింపు.. వీడియో