Heart attack | క్రికెట్(Cricket) ఆడుతూ గుండెపోటుకు(Heart attack) గురైన ఓ యువకుడు మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం : క్రికెట్(Cricket) ఆడుతూ గుండెపోటుకు(Heart attack) గురైన ఓ యువకుడు మృతి చెందిన(Young man died) విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో గురువారం చోటు చేసుకుంది. గౌతంపూర్ మిలీనియం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు పొనగంటి అంకుష్‌కు ఇద్దరు కొడుకులు.
పెద్ద కొడుకు యశ్వంత్(33)కు క్రికెట్ అంటే మక్కువ. ఈ క్రమంలో రోజు మాదిరిగానే క్రికెట్ ఆడేందుకు స్టేడియంకు వెళ్లాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒంట్లో కాస్త నలతగా ఉన్నదని తోటి క్రీడాకారులకు చెప్పి బయటకు వచ్చి చెట్టు నీడన కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
మొదట అతడికి ఫిట్స్ వచ్చిందని భావించిన మిత్రులు తర్వాత గుండెపోటుకు గురయ్యాడని గుర్తించి దవాఖానకు తరలించే లోపే మృతి చెందాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులతోపాటు స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
