ఎన్టీఆర్ (NTR) అంటే నవరసాలకు అలంకారమని సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Hero Balakrishna) అన్నారు. ఆయన నవ యువతకు మార్గదర్శనమని చెప్పారు.
హైదరాబాద్: ఎన్టీఆర్ (NTR) అంటే నవరసాలకు అలంకారమని సీనియర్ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ (Hero Balakrishna) అన్నారు. ఆయన నవ యువతకు మార్గదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో పేద వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఎన్టీఆర్ తన పాలనతో బాసటగా నిలిచారని తెలిపారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చాని చెప్పారు. కాగా, బాలకృష్ణతోపాటు రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు సుహాసిని, పలువురు పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) తన అన్న కల్యాణ్‌రామ్‌తో కలిసి తాత ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధివద్ద పూలమాల ఉంచి పుష్పాంజలి ఘటించారు. అయితే ఎన్టీఆర్ ఘాట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలిరావడంతో కొద్దిగా తోపులాట చోటుచేసుకున్నది.
