
హైదరాబాద్ క్రీడా ప్రాతినిథ్యం: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ ఎల్ )లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్ బాల్ క్లబ్ (హెచ్ ఎఫ్ సీ) సత్తా చాటింది. గచ్చిబౌలి స్టేడియంలో గురువారం నార్త్ ఈస్ట్ యునైటెడ్‌ను హెచ్‌ఎఫ్‌సి 6-1తో చిత్తు చేసింది. హెచ్‌ఎఫ్‌సి తరఫున జేవియర్ సివిరియో (8, 73), బోర్జా (24), ఒడోయి (30), చియానిస్ (77), గౌరఫ్ బోలా (80, గోల్స్) గోల్స్ చేశారు. నార్త్‌ఈస్టర్న్‌కు ఇవాన్స్ (36) ఒక్కడే స్కోరర్‌గా నిలిచాడు.
